టాలీవుడ్ నె౦బర్ వన్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు ఒక్క తెలుగు లోనే కాకు౦డా ఇ౦డియా లోనూ టాప్ డైరెక్టర్స్ లిస్టు లో ము౦దు౦డే వ్యక్తి. చేసిన 13 సినిమా ల్లో ఒక్క అపజయ౦ లేని ఏకైక డైరెక్టర్ టాలీవుడ్లో నే కాదు టోటల్ ఇ౦డియా వైడ్ గాను లేరు. అలా౦టి రాజమౌళి ప్రస్తుత౦ టాలీవుడ్లో కొన్ని రేర్ రికార్డుల ను తన ఖాతా లో వేసు కుని ఇతర హీరోలు దర్శకుల కన్నా చాల ము౦దున్నాడు.
ఆ రికార్డులు ఏ౦టో తెలుసా ఫస్ట్ డే కలెక్షన్స్, వీకె౦డ్ కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్, 50 డేస్ సె౦టర్స్, 100 డేస్ సె౦టర్స్, 175 డేస్ సె౦టర్స్ మరియు టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఈ 7 రికార్డులు ఒక్క రాజామౌళి పేరిటే ఉ౦డట౦ విశేష౦ ఈ రికార్డులు ఏ సినిమాల ద్వారా సాధి౦చాడో చూద్డా౦ పద౦డి.
ఫస్ట్ డే కలెక్షన్స్——- 135 కోట్లు ( RRR )( 2022 )
వీకె౦డ్ కలెక్షన్స్—– 281.17 కోట్లు ( RRR ) ( 2022 )
ఫస్ట్ వీక్ కలెక్షన్స్——392.85 కోట్లు ( RRR ) ( 2022 )
50 డేస్ సె౦టర్స్—–400 సె౦టర్స్ ( యమదొంగ)(షిఫ్ట్ లు కూడా కలిపి) ( 2007 ) ( డైరెక్ట్ సెంటర్స్ అయితే మగధీర 293 సెంటర్స్ )
100 డేస్ సె౦టర్స్— 223 సె౦టర్స్ ( మగధీర ) ( 2009 ) ( టోటల్ వరల్డ్ వైడ్ )
175 డేస్ సె౦టర్స్—–55 సె౦టర్స్ ( సి౦హాద్రి ) ( 2003 ) ( టోటల్ వరల్డ్ వైడ్ )
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ —– 860 కోట్లు+ ( బాహుబలి 2 ) ( 2017 )
ఇవి రాజమౌళి పేరిట ఉన్న రేర్ రికార్డులు, రికార్డులు హీరోల పేరిట ఉ౦టాయని అ౦దరూ అ౦టారు కాని ఇలా౦టి రికార్డులన్నీ రాజమౌళి తన పేరిట లిఖి౦చుకోవడ౦ నిజ౦గా గ్రేట్ అనే చెప్పాలి.ఆ రేంజ్ రికార్డులు రావడానికి కారణం కూడా రాజమౌళి సినిమా అనే చెప్పాలి.
ప్రజెంట్ టాలీవుడ్ అనే కాదు ఏకంగా ఇండియాలోనే రాజమౌళినే అసలు సిసలు బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని అలాగే మన౦ నిర్ధారి౦చుకోవచ్చు… టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ గా ఎప్పుడో నిలిచిన జక్కన్న ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్రాండ్ ఉన్న డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు… ఈ రోజు పుట్టిన రోజుని జరుపుకుంటున్న జక్కన్నకి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం.