టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకుంది కానీ ఫ్యాన్స్ ని మాత్రమే సాటిస్ ఫై చేసిన ఈ సినిమా కామన్ ఆడియన్స్ ని మాత్రం థియేటర్స్ కి రప్పించడంలో విఫలం అయ్యి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ నిరాశ పరిచే విధంగా సొంతం చేసుకుని పరుగును త్వరగానే కంప్లీట్ చేసుకుంది. అలాంటి సినిమాను రీసెంట్ గా డిజిటల్ లో…
రిలీజ్ చేశారు… నెట్ ఫ్లిక్స్ లో సినిమా తెలుగు అండ్ హిందీ వర్షన్ లు రిలీజ్ అవ్వగా ఇక్కడ మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతుంది ఈ సినిమా, కాగా తెలుగు వర్షన్ కి మొదట్లో మంచి వ్యూవర్ షిప్ రాగా తర్వాత…
హిందీ వర్షన్ డామినేషన్ మొదలు అవ్వగా సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు హిందీ వర్షన్ కి ఏకంగా 4.35 మిలియన్స్ గంటల వ్యూవర్ షిప్ సొంతం అయ్యిందట. దాంతో పాటు వరల్డ్ వైడ్ గా వివిధ దేశాల్లో ఈ సినిమా టాప్ ట్రెండింగ్…
మూవీస్ లో టాప్ 5 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతుంది ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి దెబ్బ పడినా కానీ ఇక్కడ డిజిటల్ లో మాత్రం సినిమాకి అనుకున్న దాని కన్నా కూడా బెటర్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి.