టెలివిజన్ నుండి వెండితెర కి వెళ్లి అక్కడ సక్సెస్ ను సొంతం చేసుకోవడం అంటే చాలా కష్టం అనే చెప్పాలి, మిగిలిన ఇండస్ట్రీలలో ఎలా ఉన్నా కానీ టాలీవుడ్ లో ఇలాంటివి జరగడం చాలా అంటే చాలా అరుదు, అలాంటి అరుదైన సక్సెస్ ను బుల్లితెర నుండి వెండితెరకి వెళ్లి సొంతం చేసుకున్న జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ రీసెంట్ గా గాలోడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దానికన్నా…
మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా పరుగు ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది. మొత్తం మీద 5 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద…
మంచి లాభాలను సొంతం చేసుకోగా, ఈ సినిమా ఓవరాల్ బడ్జెట్ కూడా 3 కోట్ల లోపే ఉండగా ఈ సినిమాకి హీరో రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారగా ఈ సినిమా కోసం సుడిగాలి సుధీర్ ముందు 60 లక్షల రెమ్యునరేషన్ కి ఒప్పుకున్నట్లు ట్రేడ్ లో టాక్ ఉండగా…
సినిమా సక్సెస్ తర్వాత మరో 20 లక్షలు బోనస్ గా సొంతం అయ్యాయని టాక్ ఉంది, అంటే మొత్తం మీద ఈ సినిమాకి గాను సుడిగాలి సుధీర్ 80 లక్షల రేంజ్ లో రెమ్యునరేషన్ ని సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచి కాంబినేషన్ లు సెట్ చేసుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంకా బాగా రాణించే అవకాశం ఎంతైనా ఉంది సుధీర్ కి…