బాక్స్ ఆఫీస్ దగ్గర అవతార్ 2 సినిమా ఇండియాలో మంచి కలెక్షన్స్ నే సాధిస్తుంది కానీ సినిమా పై ఉన్న అంచనాల దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ నే సినిమా సాధించి ఉండాల్సింది కానీ సినిమా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా దుమ్ము లేపినా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఇప్పుడు…
రన్ ని కంటిన్యూ చేస్తూ ఉండగా సినిమా 4వ రోజు ఇండియాలో 23 కోట్ల గ్రాస్ ను 16.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 5వ రోజు మొత్తం మీద 20.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 15.10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా టోటల్ 5 డేస్ నెట్ కలెక్షన్స్…
161 కోట్ల రేంజ్ మార్క్ ని అందుకుంది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ గా 5 రోజుల్లో ఇండియాలో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉North India – 95.80Cr
👉AP-TG: – 50.00Cr
👉Tamil – 26.05Cr
👉Karnataka – 26.25Cr
👉Kerala – 11.25Cr
Total India – 209.35CR
కాగా సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో 3D వెర్షన్స్ అండ్ ఇతర ఫార్మాట్ కలెక్షన్స్ అప్ డేట్ అవ్వగా ఓవరాల్ గా 5 రోజుల్లో 209 కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ ని ఇంకా సాలిడ్ గా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.