Home న్యూస్ విశాల్ లాఠీ తెలుగు బిజినెస్, థియేటర్స్ కౌంట్, క్లీన్ హిట్ టార్గెట్!!

విశాల్ లాఠీ తెలుగు బిజినెస్, థియేటర్స్ కౌంట్, క్లీన్ హిట్ టార్గెట్!!

0

తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో విశాల్ ఒకరు, కానీ ఒకటి రెండు మంచి సినిమాలు పడ్డా మళ్ళీ వరుస పెట్టి నిరాశ కలిగించే సినిమాల వలన మార్కెట్ ఎప్పుడూ స్టేబుల్ గా ఉండని విశాల్ నటించిన కొత్త సినిమా లాఠీ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు క్రిస్టమస్ కానుకగా ఈ గురువారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఒక్క రోజు గ్యాప్ లో…

రవితేజ ధమాకా మరియు నిఖిల్ 18 పేజెస్ రిలీజ్ కానుండగా ఆ పోటిని ఎలా తట్టుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక ఈ సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న థియేటర్స్ లెక్క మొత్తం మీద 365 కి పైగా ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఒకసారి ఆ వివరాలను గమనిస్తే…
👉Nizam – 125+
👉Ceeded – 70
👉AP – 170~
Total AP-TG : 365+
ఇదీ సినిమా టోటల్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ లెక్క. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ అటూ ఇటూగా 4 కోట్ల దాకా ఉండవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా….

ఆ లెక్కన సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో హిట్ గీతని దాటాలి అంటే మినిమమ్ 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. రీసెంట్ టైములో తెలుగులో పెద్దగా ఫామ్ లో లేని విశాల్ ఈ సినిమాతో పోటిలో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here