మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యిందని చెప్పాలి ఇప్పుడు. మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అద్బుతంగా మెప్పించగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ మాత్రం కొంచం మైండ్ బ్లాంక్ చేసేలా ఉన్నాయని చెప్పాలి ఇప్పుడు…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అయినా పెద్దగా బుకింగ్స్ ఏమి లేవు. మౌత్ టాక్ పైనే డిపెండ్ అయిన సినిమా ఇప్పుడు టాక్ ఎక్స్ లెంట్ గా ఉన్నా కానీ మార్నింగ్ షోలు డల్ గానే సాగగా మ్యాట్నీ షోల నుండి జోరు చూపించడం…
స్టార్ట్ చేసిన సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ఓపెనింగ్స్ పరంగా టాక్ కి తగ్గ రేంజ్ స్టార్ట్ ని అయితే అందుకోలేదు కానీ టాక్ సూపర్ పాజిటివ్ గా ఉండటంతో డే ఎండ్ అవ్వడం మాత్రం స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఎంతైనా ఉంది.
ప్రజెంట్ బుకింగ్స్ ని బట్టి చెప్పాలి అంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2.2 కోట్ల నుండి 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు. ఇక షో షోకి పెరిగే కలెక్షన్స్ జోరుని బట్టి ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా ఎంతవరకు జోరు చూపిస్తుందో చూసి ఎలాంటి కలెక్షన్స్ ని సాధించవచ్చు అనేది అప్ డేట్ చేస్తాం…