బాక్స్ ఆఫీస్ దగ్గర సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద మరీ టాక్ రేంజ్ లో కుమ్మేయక పోయినా కానీ ఉన్నంతలో బాక్స్ ఆఫీస్ దగ్గర ముందు జరిగిన ప్రీ బుకింగ్స్ పరంగా చూసుకుంటే మంచి జోరుని చూపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకు పోతుంది అని చెప్పాలి.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ లో 40% రేంజ్ కి అటూ ఇటూగా ఆక్యుపెన్సీని ఆన్ లైన్ టికెట్ సేల్స్ ద్వారా సొంతం చేసుకుంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అన్ని చోట్లా ట్రాక్ చేయలేం కాబట్టి మొత్తం మీద…
ముందు అనుకున్నట్లు 3 కోట్ల మార్క్ ని దాటేసి సినిమా ఇప్పుడు 3.2 కోట్ల నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను తగ్గట్లు ఉంటె 3.5 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా…
4.7 కోట్ల నుండి 5 కోట్ల లోపు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా ప్రీ బుకింగ్స్ దృశ్యా ఇవి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. కానీ టాక్ దృశ్యా ఇంకా బెటర్ కలెక్షన్స్ ని సినిమా అందుకోవాల్సి ఉంది. ఇక ఫైనల్ గా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అంచనాలను అన్నీ మించి పొతే ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది.