బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా తొలి 2 రోజుల్లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఆల్ మోస్ట్ అన్ని సెంటర్స్ లో కూడా సినిమా రెండో రోజు లెవల్ లోనే హోల్డ్ చేయగా…
కొన్ని చోట్ల సినిమా రెండో రోజు కన్నా కొంచం గ్రోత్ కూడా ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 5.6 కోట్ల నుండి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు మొదటి 2 రోజుల మాదిరిగా అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7.2 కోట్ల నుండి….
7.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొదటి వీకెండ్ లో సినిమా అద్బుతమైన పాజిటివ్ టాక్ తో ఊచకోత అంటే ఇదే అనిపించే రేంజ్ లో జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సాధించే వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.