బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా మొదటి వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ కి దగ్గర అవుతూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నైజాం ఏరియాలో మొత్తం మీద…
7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది, కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి ఈ కలెక్షన్స్ ని సినిమా అందుకుంటుందో లేదో అన్న అనుమానాలు ఏర్పడ్డాయి. బజ్ అంతగా లేక పోవడంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మూడు రోజుల్లో ఒక్క నైజాం ఏరియాలోనే ఏకంగా 7.20 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపుతూ నైజాంలో బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంది ఇప్పుడు…ఇక 4వ రోజు నుండి కూడా వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా లాభాలే అని చెప్పాలి ఇప్పుడు.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఏరియాలలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా నైజాంలో బ్రేక్ ఈవెన్ ని అందుకుని ఇక్కడ లాంగ్ రన్ లో సాలిడ్ ప్రాఫిట్స్ ను దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి…