బాక్స్ ఆఫీస్ దగ్గర సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా రెండో వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపిన విరూపాక్ష ఇప్పుడు 11వ రోజు మే డే హాలిడే కలిసి రావడంతో సినిమా మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ అల్టిమేట్ హోల్డ్ ని కొనసాగిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…
10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.38 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న తర్వాత 11వ రోజు మే డే హాలిడే ఉన్నా కూడా కొన్ని చోట్ల డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఆల్ మోస్ట్ 9వ రోజు లెవల్ లో సినిమా హోల్డ్ ని చూపిస్తూ ఉంది ఓవరాల్ గా…
అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే వర్షాలు కొంచం తక్కువగా ఇబ్బంది పెడితే సినిమా అటూ ఇటూగా 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే ఈ లెక్క పెరిగే అవకాశం ఉంది.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా గ్రాస్ అటూ ఇటూగా 3.6 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. ఈ కలెక్షన్స్ తో సినిమా 11 రోజుల్లో 72.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ 11 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి.