బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో రూపొందినా కూడా కేవలం తెలుగు మరియు మలయాళంలోనే రిలీజ్ అయిన అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ టీసర్ రిలీజ్ అయినప్పుడు సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్నా తర్వాత బజ్ తగ్గుతూ రాగా రిలీజ్ టైం కి మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన సినిమా తీవ్రమైన నెగటివ్ టాక్ ను…
సొంతం చేసుకున్న సినిమా ఏజెంట్ మూవీ మొదటి వీకెండ్ లో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు… ఇక 4 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ మొత్తం మీద 6.5 కోట్ల రేంజ్ లోనే షేర్ ని అందుకుంది సినిమా… ఆల్ మోస్ట్ 80 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ను సొంతం చేసుకున్న సినిమా…
కేవలం 6.5 కోట్ల రేంజ్ లోనే కలెక్షన్స్ ను 4 రోజుల్లో అందుకుని టోటల్ ఇండస్ట్రీ షాక్ అయ్యేలా చేసింది ఇప్పుడు. సినిమా కి పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటె 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో సినిమా మీడియం రేంజ్ మూవీస్ లో రికార్డు కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం అయితే…
ఉండేది కానీ సినిమా కి వచ్చిన ఎక్స్ ట్రీం నెగటివ్ ఇంపాక్ట్ వలన సినిమా ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేక పోయిన సినిమా ఊహకందని నష్టాలను ఇప్పుడు సినిమాను కొన్న బయర్స్ కి సొంతం అయ్యేలా చేస్తుంది ఇప్పుడు. ఇలాంటి ఫ్లాఫ్ తర్వాత అఖిల్ ఫ్యూచర్ లో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.
80 kotla cinima ani okarantaru .37 kotla pre release business ani okarantaru.80 kotla cinimaku 37 kotla business ento! Asalu ee cinima budget enta?