ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2 మూవీ(Pushpa2 The Rule) సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ రికార్డులతో ఊహకందని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయంతో పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ ఫాలోయింగ్ ను పెంచుకున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా…
ముందు త్రివిక్రమ్ తో ఉంటుంది అనుకున్నా కూడా సడెన్ గా సెన్సేషనల్ కాంబో సెట్ అయింది, జవాన్ సినిమాతో 1000 కోట్ల డైరెక్టర్ గా మారిన కోలివుడ్ యంగ్ క్రేజీ డైరెక్టర్ అయిన అట్లీ తో కలిసి అల్లు అర్జున్ మూవీని సన్ పిక్చర్స్ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు…
ఇండియన్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి ఒక మ్యాజికల్ ఎలిమెంట్ తో సినిమా ఇండియన్ మూవీస్ లో ఇప్పటి వరకు చూడని కాన్సెప్ట్ తో రూపొందబోతుందని టీం చెబుతూ ఉండగా…
ఈ సినిమా కోసం హాలీవుడ్ టాన్స్ ఫార్మర్ VFX డైరెక్టర్, అవెంజర్స్-ఆక్వామాన్ ఆర్ట్ డైరెక్టర్స్ కలిసి పని చేయబోతున్నట్లు సమాచారం, మోషన్ కాప్చర్ టెక్నాలజీని కూడా ఈ సినిమా కోసం వాడబోతూ ఉండగా…ఓవరాల్ గా సినిమా బడ్జెట్ అంచనాలను అన్నీ మించి పోతూ…
ఇండియన్ మూవీస్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందబోతుందని అంటున్నారు. ఇక సినిమా కూడా చాలా ఫాస్ట్ గానే రూపొంది వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు… అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమాతో…
ఇండియన్ మూవీస్ లో ఫస్ట్ 2000 కోట్ల మూవీని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి బర్త్ డే విషెస్ ను తెలియజేస్తున్నాం…. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ ఏ రేంజ్ లో ఇండియాని షేక్ చేస్తాడో చూడాలి.