అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ABCD… ఒక్క క్షణం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అల్లు శిరీష్ ABCD తో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. వరల్డ్ వైడ్ గా 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కి ముందుగా ఓవర్సీస్ లో పర్వాలేదు ఓకే అనిపించే టాక్ సొంతం అయ్యింది, ఇక ఇప్పుడు రెగ్యులర్ షోలకు ఫైనల్ గా సినిమా ఫేట్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి.
కథ: డబ్బంటే విలువ లేని హీరో కి డబ్బు విలువ ఏంటో చెప్పాలని హీరో తండ్రి… హీరో ని హీరో ఫ్రెండ్ ని ఇండియా పంపించి డబ్బులు ఇవ్వడు. అప్పుడు హీరో ఎలా తన లైఫ్ లో డబ్బు లేకుండా జీవితాన్ని సాగించాడు. ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు. చివరకు డబ్బు విలువ తెలుసుకున్నాడా లేదా అన్నది అసలు కథ.
విశ్లేషణ: కథలో డబ్బు విలువ తో పాటు ప్యారలల్ గా మరో కథ కూడా నడుస్తుంది. అది సెకెండ్ ఆఫ్ లో సీరియస్ గా సాగుతుంది, మొదటి అర్ధభాగం వరకు సినిమా ప్రేక్షకులను అలరించే సన్నివేశాలతో కామెడీ సీన్స్ తో ఆకట్టుకుంటుంది.
శిరీష్ మరీ నటనలో సూపర్బ్ అని కాదు కానీ పర్వాలేదు అనిపించే విధంగా నటించాడు. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా అందరి ఫేవరేట్ అయిన భరత్ సైడ్ రోల్ లో ఆకట్టుకోగా చిన్న రోల్ చేసిన హీరోయిన్ రుస్కాన్ ఆకట్టుకోగా వెన్నెల కిషోర్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది.
ఇక సంగీతం యావరేజ్ గా ఉన్నా రెండు సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది, డైరెక్షన్ కూడా సెకెండ్ ఆఫ్ లో గాడి తప్పుతుంది, ఒరిజినల్ ని అలానే దింపేసిన పూర్తిగా మెప్పించలేదు దర్శకుడు. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఒకే అనిపిస్తుంది.
ఓవరాల్ గా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే
*కొన్ని కామెడీ సీన్స్
* 2 సాంగ్స్
*వెన్నెల కిషోర్ కామెడీ
*హీరోయిన్ స్క్రీన్ ప్రెజన్స్
ఇక మైనస్ ల విషయానికి వస్తే
*సినిమా లెంత్
* సెకెండ్ ఆఫ్ ట్రాక్ తప్పడం
*డైరెక్షన్ వీక్ గా ఉండటం
*ప్రొడక్షన్ వాల్యూస్
ఇవీ ఓవరాల్ గా సినిమాలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్.
ఇక సినిమా ఓవరాల్ గా జస్ట్ ఒకే ఒకసారి చూడొచ్చు అనే విధంగా ఉంటుంది. సినిమాకి ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్..రొటీన్ కామెడీ మూవీస్ ఇష్టపడే వారు ఒకసారి చూడొచ్చు. కొత్త కథలు కావాలి అనుకునే వారికి యావరేజ్ గా అనిపిస్తుంది సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.