Home TRP రేటింగ్ బాక్స్ ఆఫీస్ ఎపిక్ డిసాస్టర్…టెలివిజన్ లో స్టార్స్ ని మించిన TRP!!

బాక్స్ ఆఫీస్ ఎపిక్ డిసాస్టర్…టెలివిజన్ లో స్టార్స్ ని మించిన TRP!!

0

కొన్ని కొన్ని సినిమాలకు ఇలా లక్ కలిసి వస్తుందో ఏమో…. బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ డిసాస్టర్ మూవీగా నిలిచిన సినిమా టెలివిజన్ లో మాత్రం సెన్సేషనల్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది. టెలివిజన్ లో రీసెంట్ టైంలో స్టార్స్ కి కూడా డబుల్ డిజిట్ టి.ఆర్.పి రేటింగ్ లు సొంతం అవ్వడం లేదు…

అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గరే అస్సలు వర్కౌట్ అవ్వని సినిమా టెలివిజన్ లో మాత్రం సాలిడ్ రేటింగ్ ను సొంతం చేసుకుని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది…ఆ సినిమానే పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) శ్రీలీల(Sreeleela) ల కాంబోలో వచ్చిన ఆదికేశవ(AdiKeshava Movie TRP Rating in Star Maa Channel)….

ఈ సినిమా మినిమమ్ హైప్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 2.5 కోట్ల లోపే రికవరీని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ట్రిపుల్ డిసాస్టర్ గా పరుగును కంప్లీట్ చేసుకుంది. అలాంటి ఈ సినిమా టెలివిజన్ లో ఏమైనా హోల్డ్ ని చూపిస్తుందని ఎవరైనా అనుకుంటారా…

కానీ అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తూ స్టార్ మా ఛానెల్ లో సైలెంట్ గా టెలికాస్ట్ అయిన ఈ సినిమా కి ఫస్ట్ టైం టెలికాస్ట్ లో ఏకంగా 10.47 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. రీసెంట్ టైంలో స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ రేంజ్ రేటింగ్ లు రావడం లేదు. అలాంటిది బాక్స్ ఆఫీస్ దగ్గర….

మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించని డిసాస్టర్ మూవీ కి టెలివిజన్ లో ఇలాంటి రేటింగ్ సొంతం అవ్వడం అన్నది మాత్రం నిజంగానే అందరికీ షాకిచ్చింది అనే చెప్పాలి. ఛానెల్ వాళ్ళు మాత్రం ఈ రేటింగ్ తో ఫుల్ ఖుషిలో ఉన్నారని చెప్పొచ్చు. ఇక తర్వాత టెలికాస్ట్ లకు కూడా ఇదే జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here