అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన సినిమా ఎపిక్ డిసాస్టర్ దిశగా పరుగును కొనసాగిస్తుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపొయింది. సినిమా బిజినెస్ ను ఇక అందుకోవడం కష్టమే అని చెప్పాలి.
సినిమా మొత్తం మీద 80 కోట్ల రేంజ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బడ్జెట్ పరంగా అందులో 10% రేంజ్ లో కూడా రికవరీని కూడా సొంతం చేసుకోలేదు…. ఇక సినిమా కి కొంచం సహకరిస్తూ నాన్ థియేట్రికల్ రైట్స్ రేటు మంచి రేటునే సొంతం చేసుకుంది.
టీసర్ రిలీజ్ టైంలో విపరీతమైన హైప్ నడుమ ఆఫర్స్ సాలిడ్ గా వచ్చినా అప్పుడు నో చెప్పగా తర్వాత రిలీజ్ దగ్గర పడే టైంలో రేటు అనుకున్న విధంగా రాక పోయినా కానీ ఓవరాల్ గా 35 కోట్ల రేంజ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ రేటుని సొంతం చేసుకుంది సినిమా…
ఇక సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తర్వాత సినిమాను ఎర్లీ డిజిటల్ రిలీజ్ చేస్తూ ఉండటంతో రేటు మరింత ఎక్కువ పెంచి టోటల్ గా 40 కోట్ల రేటుకి ఫిక్స్ చేశారట. ఓవరాల్ గా బడ్జెట్ లో సగం రికవరీ సొంతం అయినా కూడా థియేట్రికల్ బిజినెస్ ను పక్కకు పెట్టినా నష్టాలు మాత్రం కన్ఫాం అవ్వడం విచారకరం అని చెప్పాలి.