బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి ఓ రేంజ్ లో నిరాశపరిచిన విషయం తెలిసిందే… సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్న అఖిల్ కి ఈ సినిమా మైండ్ బ్లాంక్ రిజల్ట్ ను దక్కేలా చేయగా సినిమాను ఔట్ రైట్ రైట్స్ కి కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లకి సినిమా భారీ నష్టాలను మిగిలించింది.
సినిమా ద్వారా నిర్మాతకి కూడా భారీ నష్టాలే సొంతం అవ్వగా సినిమాకి డైరెక్టర్ తో పాటు సహా నిర్మాతగా వ్యవహరించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి రీసెంట్ గా తన దగ్గరికి నష్టపరిహారం కోసం వచ్చిన డిస్ట్రిబ్యూటర్ తో చెప్పిన మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమా కి డైరెక్టర్ గా తన రెమ్యునరేషన్ సుమారు 12 కోట్ల దాకా రావాలని, కానీ తనకి 6 కోట్లు మాత్రమే దక్కిందని, మిగిలిన అమౌంట్ ఇప్పటి వరకు రాలేదని చెప్పాడట డైరెక్టర్… ఆ మొత్తం 6 కోట్లను మీరే నిర్మాత నుండి తీసుకుని నష్టాలను తగ్గించుకోండి అంటూ…
డైరెక్టర్ చెప్పారని టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బడ్జెట్ పరంగా ముందు 45 కోట్ల నుండి 50 కోట్ల రేంజ్ బడ్జెట్ తోనే తెరకెక్కుతుంది అనుకున్నా సినిమా అనేక డిలేల వలన 85 కోట్ల దాకా బడ్జెట్ అవ్వగా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ తర్వాత కూడా నిర్మాతకి నష్టాలు వచ్చాయి. ఇప్పుడు కొన్న వాళ్ళు కూడా తమ డబ్బుల కోసం ఇండస్ట్రీ పెద్దలను ఆశ్రయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.