అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి హిట్ ని కొట్టిన తర్వాత ఏజెంట్ అనే మాస్ మూవీ తో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాబోతుండగా టీసర్ రిలీజ్ టైంలో విపరీతమైన బజ్ ఏర్పడినా తర్వాత మెల్లిమెల్లిగా బజ్ తగ్గుతూ వచ్చింది.. కానీ రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది మళ్ళీ బజ్ ఏర్పడింది కానీ మిగిలిన ఏరియాలతో పోల్చితే నైజాం ఏరియా బిజినెస్ మాత్రం…
మేకర్స్ అనుకున్న విధంగా జరగలేదు. కాగా మేకర్స్ నైజాం ఏరియా నుండి 15 కోట్లకు పైగా బిజినెస్ ను ఎక్స్ పెర్ట్ చేయగా ముందు కొంచం దగ్గర దగ్గరగా ఆఫర్స్ వచ్చినా కానీ తర్వాత ఆఫర్స్ తగ్గుతూ వస్తూ ఇప్పడు 8 కోట్లకు పైగా….
బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండటంతో మేకర్స్ ఆ ఆఫర్స్ కి ఏమాత్రం ఓకే చెప్పలేక పోయారు… దాంతో ఇప్పుడు రిలీజ్ దగ్గర పడటంతో దిల్ రాజుతో సినిమాను ఇప్పుడు ఓన్ రిలీజ్ చేయిస్తున్నారు నైజాంలో… కానీ సినిమా బిజినెస్ వాల్యూ మాత్రం అటూ ఇటూగా…
ఇప్పుడు 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాల అంచనా… ముందు 15 కోట్లు అనుకున్నా ఇప్పుడు ఓవరాల్ గా వాల్యూ రేంజ్ 10 కోట్ల రేంజ్ లో ఉండటంతో సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని ఈ టార్గెట్ కి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.