బాక్స్ అఫీస్ దగ్గర అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ ఏజెంట్ భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవ్వాల్సింది కానీ లాస్ట్ మినట్ లో తెలుగు తమిళ్ లోనే రిలీజ్ అవ్వగా రెండు చోట్లా కూడా సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయిన విషయం తెలిసిందే. ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయిన ఈ సినిమా బడ్జెట్ పరంగా 10% రికవరీని కూడా దక్కించుకోలేక…
ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది. అలాంటి రిజల్ట్ తో సినిమా డిజిటల్ రిలీజ్ ను కొంచం ముందుగానే చేసి లాస్ ని కొంచం తగ్గించుకోవాలని చూశారు. కానీ సినిమా రిలీజ్ అయ్యి నెల అయిపోయినా కూడా ఇప్పటి వరకు డిజిటల్ రిలీజ్ అవ్వలేదు. దానికి కారణం ఏంటి అనేది అఫీషియల్ గ చెప్పక పోయినా…
టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా రిలీజ్ కి ముందు రెండు మూడు రోజుల వరకు కూడా ఎడిటింగ్ వర్క్ జరిగింది. ఫైనల్ ఔట్ పుట్ సరిగ్గా చూసుకోకుండానే థియేటర్స్ లో రిలీజ్ చేయడంతో రిజల్ట్ భారీగా ఎదురుదెబ్బ తీసింది. కానీ కనీసం డిజిటల్ లో అయినా రీ ఎడిట్ చేసి కొంచం బెటర్ ఔట్ పుట్ ఇస్తే…
ఇక్కడ కూడా ట్రోల్ ఫేస్ చేయకుండా ఉండే అవకాశం ఉండటంతో ఇప్పుడు సినిమా రీ ఎడిట్ చేసి త్వరలో డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నట్లు లేటెస్ట్ టాక్. ఇది కనుక నిజం అయితే డిజిటల్ రిలీజ్ తర్వాత కొంచం ట్రోల్స్ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎప్పుడు డిజిటల్ రిలీజ్ అవుతుందో చూడాలి.