నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో ఆడియన్స్ ముందుకు వచ్చిన అఖండ(Akhanda Movie) సినిమా కోవిడ్ తర్వాత అనేక అనుమానాల నడుమ రిలీజ్ అయ్యి అంచనాలను అన్నీ కూడా మించి పోయి…
ఊహకందని విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లో బాక్ టు బాక్ డిసాస్టర్స్ తర్వాత ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా కెరీర్ లో కూడా ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ను ఈ సినిమాతో సొంతం చేసుకున్నాడు.
సినిమా 53 కోట్ల బిజినెస్ తో 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ లో ఏకంగా 75.10 కోట్ల షేర్ ని అందుకుని 21.10 కోట్ల ప్రాఫిట్ ను అందుకోగా….భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా సీక్వెల్ ను రీసెంట్ గా డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu)…
రామ్ పోతినేని(Ram Pothineni) తో చేస్తున్న స్కంద(Skanda) మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి సినిమాను తర్వాత బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాను చేస్తూ ఉండగా…
ఈ లోపు బోయపాటి కూడా ఒక సినిమా చేస్తారని తెలుస్తుంది. ఆ సినిమా తర్వాత వీళ్ళ కాంబోలో మోస్ట్ అవైటెడ్ అఖండ2(Akhanda2) సినిమా ఉంటుందని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఇయర్ లో మొదలు అయ్యే అవకాశం ఉండగా ఈ సినిమాతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.