Home గాసిప్స్ స్టార్ట్ అయిన మమ్మోత్ అఖండ2….బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

స్టార్ట్ అయిన మమ్మోత్ అఖండ2….బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా!!

0
Nandamuri Balakrishna Akhanda2 Movie Budget Information
Nandamuri Balakrishna Akhanda2 Movie Budget Information

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో అఖండ(Akhanda) సినిమా ముందు నిలుస్తుంది…ఎన్టీఆర్ సిరీస్, రూలర్ లాంటి ఎపిక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత కెరీర్ లోనే ఆల్ టైం లోవేస్ట్ ఫేజ్ లో వచ్చిన అఖండ మూవీ ఊహకందని రేంజ్ లో…

కంబ్యాక్ మూవీగా నిలిచి ఊచకోత కోసింది…కోవిడ్ తర్వాత ఆంధ్ర లో లో టికెట్ రేట్స్ ఇష్యూలు లాంటివి ఉన్నా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని 75 కోట్లకు పైగా షేర్ ని అందుకుని 133 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…

ఆ సినిమా విజయం తర్వాత బాలయ్య వరుసగా వీర సింహా రెడ్డి, భగవంత్ కేసరి లాంటి బాక్ టు బాక్ హిట్స్ తో ఓవరాల్ గా హాట్రిక్ ను కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండగా ఇప్పుడు NBK109 మూవీ తర్వాత బోయపాటి కాంబోలో ఇప్పుడు….

Akhanda Total World Wide Collections

సింహా, లెజెండ్, అఖండ లాంటి హాట్రిక్ హిట్స్ కొట్టిన తర్వాత వీళ్ళ కాంబోలో నాలుగో సినిమాగా రూపొందుతున్న సినిమా అఖండ సీక్వెల్ గా అఖండ2-తాండవం(Akhanda2 Thandavam Movie) ను రీసెంట్ గా స్టార్ట్ చేశారు…వచ్చే ఏడాది మొదట్లో రెగ్యులర్ షూటింగ్ ను…

స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాగా అఖండ2 ఉండబోతుందని అంటున్నారు…ఎర్లీ ఎస్టిమేషన్ ప్రకారం సినిమా బడ్జెట్ 180 కోట్ల రేంజ్ లో భారీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా నిర్మాణం అవుతుందని…

అంచనా వేస్తున్నారు ఇప్పుడు…ఇటు బాలయ్య కెరీర్ లో అటు బోయపాటి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ2 సినిమా ఆడియన్స్ ముందుకు 2026 టైంలో వస్తుందని అంచనా…ఇక ఈ సినిమాతో బాలయ్య బోయపాటిలు అఖండని మించి ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here