Home న్యూస్ “అల వైకుంఠ పురంలో” రివ్యూ…దుమ్ము లేచిపోయింది!!

“అల వైకుంఠ పురంలో” రివ్యూ…దుమ్ము లేచిపోయింది!!

0

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “అల వైకుంఠ పురంలో” ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత వీరి కాంబో లో వస్తున్న ఈ హాట్రిక్ మూవీ ప్రీమియర్ షోలకు మంచి టాక్ ని సొంతం చేసుకోగా ఇక రెగ్యులర్ షోల టాక్ ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన హీరో అంటే హీరో ఫాదర్ కి మొదటి నుండి పడదు, తన కొడుకు మీద కన్నా తన బాస్ కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపుతాడు, దాంతో హీరో కి ఫాదర్ కి క్లాష్ ఎప్పుడూ ఉంటుంది.

దానికి కారణం ఏంటి…. తర్వాత హీరో లైఫ్ ఎలా టర్న్ తీసుకుని మిగిలిన పాత్రల నేపధ్యం ఏంటి అనే విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. తన కెరీర్ లో ఇంత బెటర్ సెంటిమెంట్ సీన్స్ ఇప్పటి వరకు చేయలేదు.

అలాగే తన కామెడీ తో కానీ డాన్సులతో కానీ హీరోయిజం సీన్స్ తో కానీ అన్నింటా తన స్పెషాలిటీ ని చూపెట్టి ఆల్ మోస్ట్ 2 ఏళ్ల గ్యాప్ ని ఫ్యాన్స్ మరిచిపోయేలా పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడు. ఇక హీరోయిన్ పూజా హెడ్గే రోల్ ఉన్నంతలో ఆకట్టుకోగా…

సుశాంత్, నివేదా పెతురాజ్, నవదీప్ ఇలా మిగిలిన భారీ స్టార్ కాస్ట్ అంతా తమ తమ రోల్స్ మేర ఆకట్టుకుని మెప్పించారు. సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్… పాటలు వెండితెరపై రిపీట్స్ వేసే రేంజ్ లో పిక్చరైజేషన్ తో మెప్పించారు. ఇక హీరోయిజం సీన్స్ కి కూడా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కుమ్మేశాడు.

Ala Vaikunthapurramuloo Bookings Report & Day 1 Predictions

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు కొద్దిగా పడుతూ లేదు సాగగా సినిమాలో ఈజీ గా ఇన్వాల్వ్ అయినా కథ తో కనెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఒక్కసారి కథ లో ఇన్వాల్వ్ అయ్యాక ఇక టోటల్ గా సినిమా అయ్యే వరకు ఆ ఆసక్తి ఏమాత్రం తగ్గని స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు.

సినిమాటోగ్రఫీ అదిరిపోయే లెవల్ లో ఉండగా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతం అని చెప్పాలి. ఇక డైరెక్షన్ పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తన ప్రీవియస్ మూవీస్ నుండే డిఫెరెంట్ పాయింట్ తో సినిమా తీసినట్లు అనిపించినా ముందు చెప్పినట్లు వన్స్ కథ లో ఇన్వాల్వ్ అయ్యాక పాతవి మర్చిపోయేలా తన డైరెక్షన్ బెస్ట్ అనిపించుకుంది.

ఇక సినిమా లో హైలెట్స్ విషయానికి వస్తే… సాంగ్స్, హీరోయిజం సీన్స్, సెకెండ్ ఆఫ్ ఇతర హీరోల సాంగ్స్ అల్లు అర్జున్ ఇమిటేట్ చేసే సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, సెకెండ్ ఆఫ్ సెంటిమెంట్ సీన్స్, క్లైమాక్స్ మరిన్ని ఇతర సినిమా హైలెట్స్ గా నిలిచాయి. ఇక మైనస్ ల విషయానికి వస్తే…

కథ పాయింట్ చిన్నది అవ్వడం, కథలో ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి సమయం పట్టడం లాంటివి మైనర్ మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా త్రివిక్రమ్ డిఫెరెంట్ కాన్సెప్ట్ తో చేసిన అరవింద సమేత ని పక్కకు పెడితే… మిగిలిన మూవీస్ లో…

అత్తారింటికి దారేది తర్వాత ఆ రేంజ్ లో అన్ని ఎలిమెంట్స్ అద్బుతంగా సెట్ అయిన సినిమా “అల వైకుంఠ పురంలో”… ఫ్యామిలీ ఆడియన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు, ఫ్యాన్స్ స్టఫ్ కూడా ఉంది, ఇతర హీరోల ఫ్యాన్స్ మెప్పించే సీన్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా సంక్రాంతి పెర్ఫెక్ట్ మూవీ “అల వైకుంఠ పురంలో”….

కొంచం స్లో ఫ్లాట్ నరేషన్, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ టైం పక్కకు పెడితే ఓవరాల్ గా సినిమా రీసెంట్ టైం లో మంచి క్లాస్ అండ్ ఫ్యామిలీ మూవీస్ లో ఒకటిగా చెప్పుకోవాలి… సినిమా కి ఫైనల్ గా మా రేటింగ్ [3.25 స్టార్స్]… ఇక సంక్రాంతి కి బాక్స్ ఆఫీస్ దగ్గర అల్లు అర్జున్ ఎలా దుమ్ము లేపుతాడో చూడాలి.

Ala Vaikunthapurramuloo Bookings Report & Day 1 Predictions

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here