బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతి టైం లో భారీ పోటి లో రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ తో సంచలన రికార్డులను నమోదు చేసిన సినిమా అల వైకుంఠ పురం లో… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తమన్ అద్బుతమైన సంగీతం అందించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే సాంగ్స్ తో మంచి హైప్ ను సొంతం చేసుకుంది.
ఇక సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే టైం లో పోటి లో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి కమర్షియల్ మూవీ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం జోరు తగ్గని అల వైకుంఠ పురంలో అద్బుతమైన మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి…
టాలీవుడ్ తరుపున నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. టోటల్ రన్ లో అల్టిమేట్ 160 కోట్ల రేంజ్ షేర్ ని అందుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమాను హిందీ లో రీమేక్ చేయాలనీ డిసైడ్ అయ్యి భారీ రేటు చెల్లించి రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.
కానీ మెయిన్ లీడ్ ని సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టగా ఫైనల్ గా యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ ని సెలెక్ట్ చేయగా హీరోయిన్ గా కృతి సనన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సినిమా కి హిందీ టైటిల్ ని కూడా ఈ మధ్య కన్ఫాం చేశారని తెలుస్తుంది. తెలుగులో లెంతీ టైటిల్ ని పెట్టారు కానీ హిందీ కి వచ్చే సరికి సినిమా కి….
”షెహజాదా” అనే టైటిల్ ను ఆల్ మోస్ట్ కన్ఫాం చేసినట్లు అని టాక్ గట్టిగా వినిపిస్తుంది…. ‘షెహ్ జాదా’ అంటే ‘యువరాజు’ అని అర్థం వస్తుంది. సినిమా కి యాప్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ ఇండస్ట్రీ హిట్ రీమేక్ హిందీ లో వచ్చే ఇయర్ రిలీజ్ అవుతుందని సమాచారం. మరి అక్కడ ఎలాంటి అద్బుతాలు ఈ సినిమా సృష్టిస్తుందో చూడాలి.