Home న్యూస్ తమిళ్ గడ్డ పై తమిళ్ సినిమానే బ్రేక్ చేసి 2024 టాప్ లేపేసిన మళయాళ సినిమా!

తమిళ్ గడ్డ పై తమిళ్ సినిమానే బ్రేక్ చేసి 2024 టాప్ లేపేసిన మళయాళ సినిమా!

0

ఒక భాష సినిమా మరో భాషలో డబ్ అయ్యి సంచలన కలెక్షన్స్ ని సాధించడం మనం చూశాం, కానీ ఒరిజినల్ వర్షన్ తోనే మరో ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం మాత్రం చాలా చాలా అరుదు అని చెప్పాలి. ఇప్పుడు ఇదే చేసింది మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ…

మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys Movie) సినిమా….అన్ సీజన్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా తమిళనాడులో ఏ మలయాళ సినిమా హిస్టరీలో సాధించని రేంజ్ లో కొత్త రికార్డులను నమోదు చేసి 50 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో రికార్డ్ ను కూడా…

నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ ఇయర్ తమిళనాడులో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా గా శివ కార్తికేయన్(Siva Kartikeyan) నటించిన అయలాన్(Ayalaan Movie) మూవీ ఆల్ మోస్ట్ 57.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని టాప్ లో ఉండగా…

ఇప్పుడు ఆల్ మోస్ట్ 57.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఎపిక్ రన్ తో దూసుకు పోతుండగా ఈ రోజు కలెక్షన్స్ తో అయలాన్ మూవీ ని క్రాస్ చేసి తమిళనాడులో ప్రస్తుతానికి ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలవనుంది… ఒక మలయాళ స్ట్రైట్ మూవీ ఇలా పక్క రాష్ట్రంలో…

డబ్ అవ్వకుండానే ఒరిజినల్ వర్షన్ తో ఇప్పుడు ఏకంగా ఆ ఇయర్ లో అప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వసూళ్ళని బ్రేక్ చేయడం అంటే మామూలు రికార్డ్ కాదనే చెప్పాలి. ఇక తెలుగు లో సినిమా డబ్ వర్షన్ త్వర్లలో అంటున్నారు కానీ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here