స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టర్ సుకుమార్ ల కాంబినేషన్ లో ఆర్య సిరీస్ తర్వాత రూపొందుతున్న హాట్రిక్ మూవీ పుష్ప, ముందు తెలుగు వరకే అనుకున్నా ఏకంగా పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ సినిమా లాస్ట్ ఇయర్ అల్లు అర్జున్ పుట్టిన రోజు కి అఫీషియల్ గా అనౌన్స్ చేయగా రెగ్యులర్ షూటింగ్ కి కరోనా అడ్డు రావడం తో చాలా టైం పట్టింది ఈ సినిమా షూటింగ్ కి. అడపా దడపా సినిమా షూటింగ్ జరిగినా…
రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ జోరు అందుకోగా సినిమా మొత్తం మీద షూటింగ్ ఇప్పటి వరకు 20% రేంజ్ లోనే జరిగింది అని టాక్ ఉంది, ఇక సినిమా బడ్జెట్ పాన్ ఇండియా లెవల్ లో క్వాలిటీ కోసం ఏకంగా 150 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిస్తున్నారని సమాచారం.
ఇక సినిమా రిలీజ్ డేట్ ని రీసెంట్ గా అనౌన్స్ చేయగా అందరూ ఇండస్ట్రీ కూడా షాక్ అయింది. ఇంకా 80% షూటింగ్ బాలెన్స్ ఉన్న పాన్ ఇండియా మూవీ ని ఏకంగా ఆగస్టు 13 న రిలీజ్ చేయబోతున్నాం అంటూ రిలీజ్ డేట్ ని కన్ఫాం చేశారు మేకర్స్.. దాంతో అందరూ షాక్ అయ్యారనే చెప్పాలి.
ఎందుకంటే సుకుమార్ చాలా నెమ్మదిగా సినిమాను తెరకెక్కిస్తారని టాక్ ఎప్పటి నుండో ఉంది, పెర్ఫెక్ట్ అనుకుంటే కానీ షాట్ ఓకే చెప్పారు సుకుమార్, అలాంటి సుకుమార్ కి కూడా సినిమా రిలీజ్ డేట్ పై ఇన్ఫో లేదు అనేది లేటెస్ట్ గా టాలీవుడ్ లో వినిపిస్తున్న గాసిప్… తర్వాత ఇలా రిలీజ్ డేట్ ని అనుకుంటున్నాం అంటూ చెప్పారట. కానీ సుకుమార్ ముందు కొంచం టెన్షన్ పడినా.. ఆ టైం కి…
సినిమాను రప్పించడానికి ఓకే చెప్పారని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు… ఆల్ రెడీ ఇయర్ కి పైగా స్క్రిప్ట్ మీద వర్క్ చేయడంతో షెడ్యూల్స్ ని పెర్ఫెక్ట్ గా వేసుకుని ఆ టైం కి సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు సుకుమార్ సినిమాను ఆ టైం కి సిద్ధం చేస్తే తన కెరీర్ లో పెద్ద సినిమాల పరంగా తక్కువ వర్కింగ్ డేస్ లో పూర్తీ అయిన సినిమాగా పుష్ప నిలవడం ఖాయం. మరి ఎం జరుగుతుందో చూడాలి ఇక..