బాలయ్య బోయపాటి శ్రీను ల క్రేజీ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ రిలీజ్ కి అన్నీ సిద్ధం అవుతూ ఉండగా సినిమా డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్ధమవుతూ ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు కూడా సాలిడ్ గానీ ఓవర్సీస్ లో కూడా అంచనాలు భారీగా…
ఉండటం ఇప్పుడు విశేషంగా చెప్పుకోవాలి…. బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 500 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అవ్వగా ఇప్పటి వరకు టోటల్ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా…
120K డాలర్స్ అంటే 89 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని ఆల్ రెడీ సొంతం చేసుకుని సినిమా దుమ్ము లేపిందని అంటున్నారు. ఇక సినిమా ప్రీమియర్ షోల నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర 300K రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉండటం విశేషం. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.