మాస్ మహారాజ్ రవితేజ శ్రీను వైట్ల మరియు ఇలియానా ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ అమర్ అక్బర్ ఆంటోని బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా బిజినెస్ ముందుగా 27 కోట్ల రేంజ్ లో జరిగినా తర్వాత బయ్యర్లకి నిర్మాతలకి మధ్య జరిగిన చర్చల వలన బిజినెస్ ఓవరాల్ గా తగ్గి 22 కోట్ల రేంజ్ బిజినెస్ తో ముగిసింది. దాంతో 23 కోట్ల టార్గెట్ తో అమర్ అక్బర్ ఆంటోని బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది.
కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా జోరు అందుకోక పోవడం తో సినిమా మొదటి రోజు మొదటి షో సమయానికి కేవలం 30% ఓపెనింగ్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి సినిమా ఫేట్ డిసైడ్ అవుతుంది అని చెప్పొచ్చు.
మొత్తం మీద గ్రోత్ 45% వరకు వెళితే మొదటి రోజు సినిమా 5 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధించ వచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి మొదటి రోజు సినిమా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉంది. మరి గ్రోత్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గదమో జరుగుతుంది.