రీసెంట్ గా చిన్న సినిమానే అయినా ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమాల్లో అనసూయ ప్రధాన పాత్రలో రూపొందిన థాంక్ యు బ్రదర్ అనే సినిమా కూడా ఒకటి, ఒక ప్రేగ్నంట్ లేడీ అండ్ ఒక కుర్రాడు ఒక లిఫ్టు లో ఇరుక్కోవడం, ఆ ప్రేగ్నంట్ లేడీ కి అనుకోకుండా నొప్పులు రావడం తో ఆ కుర్రాడు ఆ లిఫ్టు నుండి ఆమెని ఎలా బయటికి రప్పించాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా…
ట్రైలర్ ఇంప్రెస్ చేయడం తో ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ క్రియేట్ అవ్వగా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది, కానీ సడెన్ గా ఇప్పుడు సినిమా ఒరిజినల్ కథ కాదని కాపీ కొట్టి సినిమా తీస్తున్నారు అంటూ…
సోషల్ మీడియా లో వార్తలు శిఖారు చేస్తున్నాయి. ఎప్పుడూ హాలీవుడ్ లేదా కొరియన్ మూవీస్ ను చూసి కాపీ కొట్టి కథలను రాసుకోవడం చాలా వరకు అందరికీ అలవాటు కానీ ఇప్పుడు మొదటి సారి నైజీరియన్ మూవీ నుండి కథని కాపీ కొట్టి ఈ సినిమా తీస్తున్నారని టాలీవుడ్ లో టాక్ ఉంది.
2019 లో నైజీరియన్ భాషలో రూపొందిన ఎలేవేటర్ బేబీ అనే సినిమా కథ పాయింట్ అచ్చూ ఇలానే ఉంటుందని, ఆ కథ కే తెలుగు నేటివిటికి మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారని అంటున్నారు. ఆ సినిమా పోస్టర్ లు టీసర్ ట్రైలర్ లు చూస్తుంటే అదే నిజం అని పక్కా క్లారిటీగా తెలుస్తుంది కూడా. ఎప్పుడూ లేనిదీ ఫస్ట్ టైం…
నైజీరియన్ మూవీస్ ను కాపీ కొట్టడం ఈ సినిమా నుండే జరగడం తో సినిమా సక్సెస్ అయితే మరిన్ని నైజీరియన్ మూవీస్ నుండి కథలను కాపీ కొట్టే సినిమాలు వచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా 7 న ఆహా యాప్ లో రిలీజ్ కానుంది కాబట్టి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు.