Home న్యూస్ అనుభవించు రాజా రివ్యూ…..హిట్టా-ఫట్టా!

అనుభవించు రాజా రివ్యూ…..హిట్టా-ఫట్టా!

0

యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంటూ వచ్చాయి. ఇలాంటి టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగైనా హిట్ కొట్టి తీరాల్సిందే అన్న అవసరంతో లేటెస్ట్ గా రాజ్ తరుణ్ నటించిన సినిమా అనుభవించు రాజా సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది… మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…. హీరో సిటీలో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ లా పని చేస్తాడు…. ఆ కంపెనీలో పనిచేసే హీరోయిన్ ని చూసి ఇష్టపడగా ముందు హీరోని సాఫ్ట్ వేర్ అనుకున్న హీరోయిన్ తర్వాత సెక్యూరిటీ గార్డ్ అని తెలుసి వదిలించుకోవాలని చూస్తుంది…

కానీ అప్పుడే హీరో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కి తెలుస్తుంది… ఇంతకీ హీరో ఫ్లాష్ బ్యాక్ ఏంటి… హీరో సిటీకి ఎందుకు వచ్చి సెక్యూరిటీ గార్డ్ లా పనిచేస్తున్నాడు, తర్వాత ఏమయింది అన్నది సినిమా స్టొరీ పాయింట్… చాలా సింపుల్ స్టొరీ పాయింట్ ని కొన్ని కొన్ని డీసెంట్ సీన్స్ తో రాసుకుని…

ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ పర్వాలేదు లే అనిపించిన అనుభవించు రాజా తర్వాత ట్రాక్ తప్పింది. ఏ దశలో కూడా తిరిగి ట్రాక్ ఎక్కలేక ఔట్ డేటెడ్ కథతో ఔట్ డేటెడ్ కామెడీ సీన్స్ తో నిండిపోయి యావరేజ్ గా నిలిచింది. రాజ్ తరుణ్ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాడు. కథలో దమ్ము లేక పోవడంతో…

తను కష్టపడుతున్నా ఆ సీన్స్ పేలవంగా మారిపోయాయి. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా అజయ్ విలనిజం రొటీన్ గానే ఉంది, ఇక కామెడీ బాచ్ నవ్వించడానికి ట్రై చేశారు కానీ చాలా తక్కువే పండాయి. ఓవరాల్ గా కథనే చాలా ఔట్ డేట్ గా ఉండగా ఫస్టాఫ్ ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కానీ సెకెండ్ ఆఫ్ మాత్రం…

నీరసంగా మారిపోయింది… విలేజ్ పాలిటిక్స్ రొటీన్ సీన్స్ ఎక్కడా కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేక పోయాయి… ఉన్నంతలో కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపించడం లాంటివి సినిమా ను అతి కష్టం మీద ఒకసారి చూసేలా చేశాయి కానీ రాజ్ తరుణ్ నుండి కెరీర్ మొదట్లో వచ్చిన ఉయ్యాలా జంపాల…. సినిమా చూపిస్తా మావా లాంటి సినిమాల రేంజ్ ….

ఎంటర్ టైన్ మెంట్ ని ఎక్స్ పెర్ట్ చేస్తే మట్టుకు నిరాశ చెందటం ఖాయం, ఎదో అలా టైం పాస్ చేయాలని థియేటర్స్ కి వెళితే కొంచం కష్టం అయినా ఎదో కొన్ని సీన్స్ మెప్పించి ఒకసారి చూడొచ్చులే అనిపించేలా సినిమా ముగుస్తుంది… మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here