Home న్యూస్ అఖండ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే!

అఖండ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఇదే!

0

బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబోలో ఆడియన్స్ ముందుకు అతి త్వరలో రావడానికి సిద్ధంగా ఉన్న సినిమా అఖండ. మంచి అంచనాలతో డిసెంబర్ 2 న భారీగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు కూడా భారీగానే ఉండగా భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఫుల్ ప్రిపరేషన్ లో ఉండగా సినిమా ప్రమోషన్స్ కూడా యమ జోరుగా సాగుతున్నాయి అని చెప్పాలి…

కాగా రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ ఈ సినిమా కి అనుకున్న టైటిల్ అఖండ కాదని….. వేరే కొన్ని టైటిల్స్ అనుకున్నాం కానీ బాలయ్య బోయపాటి ల కాంబోలో ఒక టైటిల్ ని మేం ఇది వరకే…

రిజిస్టర్ చేయించామని… ఆ టైటిల్ మహర్జాతకుడు టైటిల్ అని చెప్పుకొచ్చారు.. ఈ సినిమా కి కూడా ఈ టైటిల్ సెట్ అవుతుంది కానీ సడెన్ గా అఖండ అనే టైటిల్ సెట్ అవ్వడం అది జనాల్లో మంచి రీచ్ ని సొంతం చేసుకోవడం విశేషం అంటూ చెప్పుకొచ్చారు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here