Home న్యూస్ AP-TG రెండో వారం అత్యధిక షేర్ వసూల్ చేసిన టాప్ 5 మూవీస్

AP-TG రెండో వారం అత్యధిక షేర్ వసూల్ చేసిన టాప్ 5 మూవీస్

0

     టాలీవుడ్ మార్కెట్ బాహుబలి ఎంత ఎక్స్ పాండ్ చేసినా ఆ మార్కెట్ ని వాడుకున్న సినిమాలు తక్కువే, అంతెందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ళ తో బాహుబలి లాంటి లాంగ్ రన్ ఉన్న సినిమాలు కూడా తక్కువ, బాహుబలి ని పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో మొదటి వారం తర్వాత రెండో వారం భారీ గా హోల్డ్ చేసిన సినిమా లు వేళ్ళ మీదే లెక్క పట్టవచ్చు.

రీసెంట్ టైం లో రంగస్థలం మరియు గీత గోవిందం లాంటి సినిమా లు మాత్రమె మొదటి వారం లో ఎలాంటి జోరు చూపాయో రెండో వారం కూడా సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్నాయి, మిగిలిన చాలా పెద్ద సినిమాలు మొదటి వారం జోరు చూపి రెండో వారం స్లో డౌన్ అయ్యాయి.

ఓవరాల్ గా టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ ని పక్కకు పెడితే మిగిలిన సినిమాలలో ఓవరాల్ గా ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో రెండో వారం లో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వసూళ్ళతో సెన్సేషన్ ని క్రియేట్ చేసిన టాప్ 5 సినిమాలను గమనిస్తే…

1. ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) 17.69 కోట్లు, 2. రంగస్థలం 14.52 కోట్లు, 3. ఖైదీ నంబర్ 150 13.9 కోట్లు, 4. సరైనోడు 13.75 కోట్లు, 5. గీత గోవిందం 12.9 కోట్లు వసూళ్లు సాధించి రెండు తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ ని రెండో వారం అందుకున్న సినిమాలుగా నిలిచాయి.

లిస్టులో గీత గోవిందం ఒక్కటే చిన్న సినిమా అయినా భారీ థియేటర్స్ ఉన్నాయు, కానీ టాప్ లేపిన F2 మాత్రం సంక్రాంతి భారీ పోటి లో పెద్ద సినిమాలను మించి కలెక్షన్స్ ని అందుకుని రెండో వారం లో కూడా హిస్టారికల్ కలెక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టింది, మరి ఈ రికార్డ్ కొట్టే సినిమా ఏది అవుతుందో చూడాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here