బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఓ రేంజ్ లో ఎక్స్ పాండ్ అయ్యింది, బాహుబలి సిరీస్ వలన భారీగా కలెక్షన్స్ అప్ కమింగ్ మూవీస్ అన్నింటికీ కూడా సొంతం అవుతూ ఉండగా టికెట్ హైక్స్, స్పెషల్ షోలు ఇలా స్పెషల్ పర్మీషన్స్ తో కలెక్షన్స్ మ్రోత మ్రోగిపోతుంది, దాంతో ఓపెనింగ్ డే నే రికార్డుల వర్షం కురుస్తూ ఉండగా ఆ కలెక్షన్స్ ప్రవాహం మొదటి వీకెండ్ వరకు చాలా సినిమాలకు కొనసాగింది అని చెప్పాలి…
బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు సినిమా కి వచ్చే టాక్ ఇంపాక్ట్ వీకెండ్ వరకు కొన్ని సినిమాలకు ఎఫెక్ట్ చూపినా కానీ కొన్ని సినిమాలు ఆ టాక్ ని కూడా తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం….
లేపడం విశేషం అని చెప్పాలి. ఇక రీసెంట్ టైం లో వకీల్ సాబ్, పుష్ప మరియు భీమ్లా నాయక్ లాంటి సినిమాలకు ఆంధ్ర లో లో టికెట్ రేట్స్ ఎఫెక్ట్ చూపినా కానీ మొత్తం మీద మొదటి వీకెండ్ కలెక్షన్స్ పరంగా అయితే సంచలన కలెక్షన్స్ ని నమోదు చేశాయి.
ఒకసారి ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో తెలుగు రాష్ట్రాలలో మొదటి 3 రోజుల కలెక్షన్స్ పరంగా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే…
👉#Baahubali2-74.40Cr
👉#Saaho- 58.67C
👉#Syeraa- 55.82C
👉#VakeelSaab – 53.37CR
👉#Bheemlanayak- 53.07CR***
👉#Pushpa – 52.98Cr
👉#SarileruNeekevvaru- 49.30Cr
👉#AlaVaikunthaPurramuloo – 47.39Cr
👉#AravindhaSametha- 41.80Cr
👉#Maharshi- 40.69Cr
ఇవీ మొత్తం మీద టాప్ 10 ప్లేసులలో నిలిచిన సినిమాలు…
బాహుబలి మొదటి పార్ట్ 40.51 కోట్ల రేంజ్ వసూళ్లు అందుకోగా పాన్ ఇండియా మూవీస్ కాకుండా హైయెస్ట్ 3 డేస్ కలెక్షన్స్ రికార్డ్ ను వకీల్ సాబ్ సినిమా సొంతం చేసుకుంది. ఇప్పుడు భీమ్లా నాయక్ కి టికెట్ హైక్స్ ఇచ్చి ఉంటే సాహో కలెక్షన్స్ ని కూడా అందుకుని ఉండేది కానీ టికెట్ హైక్స్ లేక పోవడం తో దెబ్బ పడినట్లు అయినా ఓవరాల్ గా టాప్ 5 లో నిలవడం విశేషం….