Home న్యూస్ 18 ఏళ్ల క్రితం తెలుగులో రికార్డ్ కొట్టిన అపరిచితుడు రీ రిలీజ్….ఎన్ని థియేటర్స్ లో రిలీజో...

18 ఏళ్ల క్రితం తెలుగులో రికార్డ్ కొట్టిన అపరిచితుడు రీ రిలీజ్….ఎన్ని థియేటర్స్ లో రిలీజో తెలుసా!

0

18 ఏళ్ల క్రితం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డబ్బింగ్ సినిమానే అయినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన విక్రమ్(Vikram) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన అపరిచితుడు(Aparichitudu Re Release) సినిమా ఊహకందని విజయాన్ని ఇక్కడ సొంతం చేసుకుంది….

తెలుగులో అప్పట్లో ఈ సినిమా కన్నా ముందు వచ్చిన చంద్రముఖి రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసి తెలుగులో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న తమిళ్ డబ్బింగ్ మూవీగా నిలిచింది. ఆ టైంలో ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని టోటల్ రన్ లో 14 కోట్లకు పైగా షేర్ ని అందుకుని…

డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అపరిచితుడు సినిమాను ఇప్పుడు రిలీజ్ అయిన ఆల్ మోస్ట్ 18 ఏళ్లకి తెలుగులో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. మే 17 వీకెండ్ లో రిలీజ్ అవ్వాల్సిన విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో…

ఆ సినిమా ప్లేస్ లో ఇప్పుడు అపరిచితుడు సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు, నైజాంలో 90 స్క్రీన్స్ లో టోటల్ ఆంధ్ర సీడెడ్ లలో 150 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారట. అంటే ఆల్ మోస్ట్ 240 స్క్రీన్స్ లో సినిమా తెలుగు లో రీ రిలీజ్ కానుంది. ఇక సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here