యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 18 రోజుల్లో మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 72.58 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 97.33 కోట్ల షేర్ ని అందుకోగా సోమవారం కలెక్షన్స్ తో సినిమా 97.58 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. కాగా మంగళవారం కలెక్షన్స్ మాత్రం అనుకున్న లెవల్ లో లేక పోవడం థియేటర్స్ సంఖ్య కూడా ఘననీయంగా తగ్గిపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది.
దాంతో ఇప్పుడు సినిమా 100 కోట్ల రేసులో వెనక బడింది అనే చెప్పాలి. ఎందుకంటే నాలుగో వారం సినిమా థియేటర్స్ 100 కి అటూ ఇటూ గా ఉండబోతున్నాయి. దాంతో కలెక్షన్స్ మరింత తగ్గడం ఖాయం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ కి వీకెండ్ లో అల్టిమేట్ గ్రోత్ తో ఫుల్ ఆక్యుపెన్సీ వచ్చినా కానీ..
రోజుకి 1 కోటి షేర్ రావడం కష్టమే అని చెప్పాలి వీకెండ్ లో. దాంతో టోటల్ రన్ ని సినిమా దీపావళి సమయంలో ముగించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అలాగే టోటల్ రన్ లో సినిమా 100 లోపే ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. దాంతో సినిమా బిజినెస్ ని దాటి సూపర్ హిట్ టాగ్ తో ఓవరాల్ గా ముగించే అవకాశం ఉంది.