Home న్యూస్ అరవింద సమేత సెన్సార్ టాక్….మెయిన్ హైలెట్స్ ఇవే!!

అరవింద సమేత సెన్సార్ టాక్….మెయిన్ హైలెట్స్ ఇవే!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ వాంటెడ్ మూవీ అరవింద సమేత మూవీ సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది…భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు…ఇక సెన్సార్ కంప్లీట్ చేసుకున్న తర్వాత తొలి టాక్ కూడా బయటికి వచ్చేసింది..

ముందుగా సినిమాకి U/A సెర్టిఫికేట్ లభించగా రన్ టైమ్ సుమారు 2 గంటల 42 నిమిషాలు అని తెలిసింది. ఇక సినిమా గురించి చెప్పాలి అంటే స్టోరీ లైన్ గురించి చెప్పకున్నా కానీ ఓవరాల్ గా స్టోరీ పాయింట్….అనుకోకుండా ఒక యుద్ధం చేసే హీరో..ఆ యుద్ధం జరిగాక…

ఎలాంటి పరిస్థితులను ఎదురుకొన్నాడు…అయినా తనకి మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం వస్తే ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మెయిన్ ప్లాట్ గా చెబుతున్నారు…ఇది జస్ట్ స్టోరీ లైన్ మాత్రమే అని అసలు సినిమా అదిరిపోయిందని అంటున్నారు.

సింపుల్ గా రీసెంట్ ఎన్టీఆర్ మూవీస్ లో టెంపర్ తర్వాత బెస్ట్ కంటెంట్ ఇందులోనే ఉంది అంటున్నారు…కంటెంట్ ఫుళ్లుగా ఉంది కాబట్టి అది ఎక్కడానికి కొంత సమయం పడుతుందని…ప్రేక్షకులు సినిమాలో ఇంవాల్వ్ అవ్వడానికి హీరో క్యారక్టర్ ని అర్ధం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది అంటున్నారు.

వన్స్ అర్ధం అయ్యాక సినిమా ప్రేక్షకులు ఓన్ చేసుకునే విధంగా ఉంటుంది అంటున్నారు…సెకెండ్ ఆఫ్ సినిమాకి ఆయువు పట్టు అని అంటున్నారు… ఎన్టీఆర్ ముందు సటిల్డ్ పెర్ఫార్మెంస్ ఉంటుందని కానీ ఇంటర్వల్ నుండి సినిమా లెవల్ మరో విధంగా ఉంటుందని అంటున్నారు.

సింపుల్ గా సినిమా మొదటి అర్ధభాగం క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ మెంట్ కి కొంత సమయం పట్టినా తర్వాత మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకునే ఎమోషనల్ ఫాక్షన్ బ్యాగ్ డ్రాప్ మూవీ అని అంటున్నారు…త్రివిక్రమ్ సినిమాతో అద్బుతమైన కంబ్యాక్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.

హైలెట్స్ లో ఇంటర్వల్ ముందు ఫైట్, సెకెండ్ ఆఫ్ ఫైట్, హీరో క్యారెక్టరైజేషన్, తమన్ సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్, త్రివిక్రమ్ డైలాగ్స్ ఉంటాయని, మైనస్ ల విషయానికి వస్తే కథలో ఇన్వాల్వ్ మెంట్ కి కొంత సమయం పట్టడం మాత్రమే అని అంటున్నారు..

ఓవరాల్ గా ఇదీ సెన్సార్ వారి నుండి వినిపిస్తున్న టాక్…ఇకసినిమా ఇదే రేంజ్ లో రిలీజ్ అయ్యాక టాక్ ని సొంతం చేసుకుంటే నికార్సాయిన బ్లాక్ బస్టర్ ఎన్టీఆర్ ఖాతాలో పడినట్లే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here