Home న్యూస్ అరవింద సమేత కర్ణాటక టోటల్ కలెక్షన్స్…ఇండస్ట్రీ హిట్

అరవింద సమేత కర్ణాటక టోటల్ కలెక్షన్స్…ఇండస్ట్రీ హిట్

0

  రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. గట్టిగా చెప్పాలి అంటే అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మరే హీరో కూడా ఎన్టీఆర్ ల కన్సిస్టంట్ గా అక్కడ బయ్యర్లకి లాభాలు ఇవ్వలేదు. సినిమా సినిమా కి అక్కడ తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత అక్కడ..

టోటల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. సినిమాను అక్కడ టోటల్ గా 8.5 కోట్లకు అమ్మగా సినిమా టోటల్ గా 370 వరకు థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అయ్యి టోటల్ గా మొదటి రోజు 5.27 కోట్ల షేర్ తో ఇండస్ట్రీ రికార్డ్ అందుకుంది. తర్వాత టోటల్ రన్ లో సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర…

8.2 కోట్ల వర్త్ షేర్ ని అందుకోగా హైర్స్ రూపంలో సినిమాకి 2 కోట్ల మేర దక్కాయి. దాంతో టోటల్ రన్ లో సినిమా కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర 10.2 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గా గ్రాస్ 23 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. అక్కడ బాహుబలి సిరీస్, అరవింద సమేతలు తప్పితే మరే సినిమా కూడా 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకోలేదు. దాంతో కర్ణాటక ఇండస్ట్రీ హిట్ గా మారింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here