Home న్యూస్ 205కోట్లు*…చరిత్రలో ఒకేఒక్కడు

205కోట్లు*…చరిత్రలో ఒకేఒక్కడు

0

  కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ మరియు మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన సెన్సేషనల్ మూవీ సర్కార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కొస్తుంది. సినిమా దీపావళి వీకెండ్ ముగిసే లోపే ఆల్ మోస్ట్ 200 కోట్లకు చేరువ అయ్యి చరిత్ర సృష్టించింది. తమిళనాడు లో సినిమా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 7 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక మిగిలిన చోట్ల కూడా…

సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా మొత్తం మీద 7 వ రోజు కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్ల మార్క్ ని దాటి 205 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నట్లు సమాచారం. ఇది నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పాలి.

 విజయ్ కెరీర్ లో ఇది వరుసగా రెండో సారి 200 కోట్ల మార్క్ ని అందుకున్న సినిమా. లాస్ట్ ఇయర్ మెర్సల్ 244 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు 7 రోజుల్లోనే 200 కోట్లను మరోసారి అందుకుని చరిత్రలో ఈ రికార్డ్ కొట్టిన ఒకే ఒక్కడిగా విజయ్ ఆల్ టైం హిస్టారికల్ బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here