Home న్యూస్ అక్షరాలా 90 కోట్ల లాభం…యంగ్ టైగరా మజాకా!!

అక్షరాలా 90 కోట్ల లాభం…యంగ్ టైగరా మజాకా!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 91 కోట్లకు జరగగా ఇప్పుడు సినిమా టోటల్ గా 92 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది.

కాగా సినిమా కి గాను నిర్మాతలకు భారీ లాభాలు దక్కాయి…సినిమాను ఓవరాల్ గా 60 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకేక్కించగా సినిమా టోటల్ బిజినెస్ 91 కోట్లు అవ్వడంతో అప్పటికే 31 కోట్ల లాభం దక్కగా…సినిమా శాటిలైట్ రైట్స్ కింద 23 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కింద మరో 20 కోట్లు వెబ్ మీడియా రైట్స్ కింద మరో 15 కోట్లు…ఇక ఆడియో రైట్స్ కింద 1.5 కోట్లు దక్కాయట.

ఓవరాల్ గా ఇతర మాధ్యమాల ద్వారా సినిమాకి మరో 60 కోట్ల వరకు లాభాలు దక్కగా బిజినెస్ లో లాభం తో కలుపుకుంటే టోటల్ గా లాభాలు సుమారు 90 కోట్ల వరకు ఉంటాయని సమాచారం…ఇది నిజంగానే బిగ్గెస్ట్ రికార్డ్ అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here