Home న్యూస్ 24 గంటల రికార్డ్…16 గంటల్లో ఫినిష్…కుమ్మెశారు!

24 గంటల రికార్డ్…16 గంటల్లో ఫినిష్…కుమ్మెశారు!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో పెను సంచలనం సృష్టించారు…ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ ల కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ అరవింద సమేత వీర రాఘవ అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అత్యధిక వ్యూస్ తో పాటు లైక్స్ తోను సంచలనం సృష్టిస్తు దూసుకుపోతున్నారు అభిమానులు…ఇప్పటికే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ తో పాటు ఏకంగా ఫాస్టెస్ట్ 2 లక్షలు, 2 లక్షల 50 వేల లైక్స్ ని కూడా కంప్లీట్ చేయగా…

ఇప్పుడు ఏకంగా 2 లక్షల 75 వేల లైక్స్ తో అజ్ఞాతవాసి పేరిట ఉన్న 24 గంటల లైక్స్ రికార్డ్ 2 లక్షల 72 వేలని 16 గంటల్లో క్రాస్ చేసి 3 లక్షల లైక్స్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతున్నారు…ఈ లెక్కన 24 గంటల్లో మరిన్ని అద్బుతమైన రికార్డులు నమోదు అవ్వడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here