Home TRP రేటింగ్ 65 లక్షల రేటు….రికార్డ్ లెవల్ TRP….సెన్సేషన్ ఇది!!

65 లక్షల రేటు….రికార్డ్ లెవల్ TRP….సెన్సేషన్ ఇది!!

2492
0

అప్పుడప్పుడు కొన్ని డబ్బింగ్ మూవీస్ కి అద్బుతమైన TRP రేటింగ్ లు రావడం కామన్ అయింది, తక్కువ రేట్లకి సినిమాల శాటిలైట్ రైట్స్ ని కొన్ని కొంచం ప్రమోషన్ లాంటివి చేసి సినిమా ను ప్రైమ్ టైం లో టెలికాస్ట్ చేస్తే చాలు మంచి రేటింగ్ రావడం ఖాయమని ఇప్పటికే చాలా సినిమాలు లాస్ట్ ఇయర్ నుండి నిరూపిస్తూ వస్తున్నాయి. స్ట్రైట్ మూవీస్ ని ఆల్ రెడీ చాలా మంది రిలీజ్ అయినప్పుడో…

లేక డిజిటల్ ఫార్మాట్ లోనో చూసి ఉంటారు… కానీ ఇతర భాషల సినిమాలను తక్కువ శాతం మంది మాత్రమే చూస్తారు కాబట్టి అలాంటి సినిమాలను ఎంచుకుని తెలుగు డబ్బింగ్ పనులను పూర్తీ చేసి సినిమాలను టెలికాస్ట్ చేస్తున్నారు తెలుగు ఛానెల్స్ వాళ్ళు… చాలా వరకు రిజల్ట్ కూడా ఛానెల్స్ కి అనుకూలంగానే వస్తుంది.

లేటెస్ట్ గా తమిళ్ హీరోనే అయినా తెలుగు వాళ్ళకి కూడా తెలిసిన హీరో అయిన ఆర్య నటించిన లేటెస్ట్ తమిళ్ మూవీ టెడ్డి థియేటర్స్ లో రిలీజ్ అనుకున్నా సెకెండ్ వేవ్ వలన సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేశారు. సినిమా తెలుగు డబ్ వర్షన్ ని…

కూడా రిలీజ్ చేయగా తక్కువ మందే డిజిటల్ లో చూశారు. ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానెల్ వాళ్ళు కేవలం 65 లక్షల రేటు మాత్రమే చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా సినిమాను రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ చేయగా TRP రేటింగ్ అదిరిపోయే రేంజ్ లో వచ్చింది. ఏకంగా 8.52 TRP రేటింగ్ ను…

ఈ సినిమా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. పెట్టిన రేటు కి ఇది రికార్డ్ లెవల్ TRP రేటింగ్ అని చెప్పొచ్చు. చాలా వరకు ప్రస్తుతం పెద్ద సినిమాలకు తెలుగు లో వస్తున్న రేంజ్ రేటింగ్ ఇది. ఇదంతా కేవలం 65 లక్షల రేటు కే సొంతం అవ్వడం తో ఫస్ట్ టైం సాలిడ్ ప్రాఫిట్స్ ని ఛానెల్ సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here