Home న్యూస్ 20 కోట్లు అనుకుంటే 6.50 కోట్లే….రికార్డ్ అనుకుంటే ఇలా జరుగుతుందేంటి!!

20 కోట్లు అనుకుంటే 6.50 కోట్లే….రికార్డ్ అనుకుంటే ఇలా జరుగుతుందేంటి!!

0

వచ్చే శుక్రవారం బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సునామీ ని తలపించే కలెక్షన్స్ తో ఊచకోత కోయడానికి సిద్ధమవుతున్న సినిమా అవతార్ ది వే ఆఫ్ వాటర్… 2009 టైం లో వచ్చిన అవతార్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు ఏకంగా 13 ఏళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్ పై హైప్ అయితే ఉంది కానీ ముందు ఊహించన రేంజ్ లో అయితే ఇప్పుడు…

బజ్ కనిపించడం లేదు అని చెప్పాలి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే రికార్డ్ బుకింగ్స్ తో సినిమా దుమ్ము దుమారం లేపుతుంది అనుకుంటే కొన్ని ఏరియాలకు తప్పితే చాలా వరకు సెంటర్స్ లో బుకింగ్స్ నార్మల్ గానే కనిపిస్తూ ఉన్నాయి.

హాలీవుడ్ బిగ్గీస్ అవెంజర్స్ మరియు స్పైడర్ మాన్ నో వే హోమ్ సినిమాలతో పోల్చితే ప్రజెంట్ అవతార్ 2 బుకింగ్స్ తక్కువగానే ఉన్నాయి… రిలీజ్ కి 2 వారాల ముందే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఇండియా లో ఓపెన్ చేయగా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ద్వారా…

సినిమా కి 6.5 కోట్ల గ్రాస్ బుకింగ్స్ జరిగాయి. మినిమమ్ ఈ పాటికే 20 కోట్ల రేంజ్ లో బుకింగ్స్ ని ఎక్స్ పెర్ట్ చేశారు అందరూ… కానీ ప్రస్తుతానికి బుకింగ్స్ అంతంత మాత్రమే ఉన్నప్పటికీ రిలీజ్ కి ముందు రోజు టైం కి హైప్ ఆటోమాటిక్ గా వస్తుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇదే జరుగుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here