Home న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తున్న అవతార్ 2 బిజినెస్ కోట్స్!!

ప్రకంపనలు సృష్టిస్తున్న అవతార్ 2 బిజినెస్ కోట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర డిసెంబర్ 16న అత్యంత భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతున్న సెన్సేషనల్ మూవీ అవతార్ 2…. 2009 లో వచ్చిన అవతార్ సినిమా ఇప్పటి కీ వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పటికీ అద్బుతాలు సృష్టిస్తూ రీ రిలీజ్ లో మరోసారి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా….

ఇక పార్ట్ 2 పార్ట్ 1 వచ్చిన ఆల్ మోస్ట్ 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి ఇండియా లో కూడా విపరీతమైన క్రేజ్ అండ్ బజ్ ఏర్పడగా సౌత్ లో హైప్ కూడా ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి.

అందులో తెలుగు రాష్ట్రాల్లో సినిమా కి బజ్ మరో లెవల్ లో ఉండగా ఇప్పుడు బిజినెస్ పరంగా భారీ లెవల్ లో ఆఫర్స్ వస్తున్నా మేకర్స్ ఇక్కడ బయర్స్ కి కోట్ చేసిన రేటు ఇండస్ట్రీ లో ప్రకంపనలు సృష్టించింది….

ఏకంగా 100 కోట్ల రేంజ్ రేటుని కోట్ చేయగా ఈ రేటు చూసి బయర్స్ షాకయ్యారు. ఆల్ మోస్ట్ టాప్ స్టార్స్ ని తలపించే రేంజ్ లో రేంజ్ లో ఈ రేటుని కోట్ చేయగా ఇప్పుడు బయర్స్ కోట్స్ స్టార్ట్ అయ్యాయని తెలుస్తుంది. త్వరలోనే రేటు ఫైనల్ కానుంది. ఆ రేటు ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here