Home న్యూస్ అవతార్2 రివ్యూ…ఎపిక్ విజువల్ వండర్!!

అవతార్2 రివ్యూ…ఎపిక్ విజువల్ వండర్!!

0

2009 టైంకి పెద్దగా టెక్నాలజీ డెవలప్ కాని టైంలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో వచ్చిన అవతార్ సినిమా చూసి ప్రతీ ఒక్కరు ఏం సినిమా రా బాబు అనుకున్నారు. ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో ఇప్పటికీ నంబర్1గా ఉంది ఆ సినిమా. కానీ తర్వాత ఇలాంటి విజువల్ వండర్స్, మోషన్ టెక్నాలజీతో వచ్చిన సినిమాలు ఎన్నో వచ్చిన తర్వాత అవతార్2 ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా ఇప్పటి ఆడియన్స్ ను ఈ సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

అవతార్1 ఎండ్ కార్డ్ తర్వాత స్టార్ట్ అయిన అవతార్ 2 లో అప్పటి క్యారెక్టర్స్ కంటిన్యూ అవ్వగా హీరోకి పిల్లలు పుట్టగా విలన్ కూడా మళ్ళీ వస్తాడు, హీరోని తన తెగ ప్రజలను అందరినీ చంపేయాలని చూస్తాడు.. తన ఫ్యామిలీకి తన తెగ ప్రజలను కాపాడుకోవడానికి మరో చోటుకి వెళతాడు హీరో… ఈ విషయం తెలుసుకున్న విలన్ ఏం చేశాడు…

హీరో విలన్ తో మళ్ళీ ఎలా పోరాడాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ప్రజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి ఈ సినిమా ఒక ఎక్స్ టెండెడ్ వీడియో గేమ్ లా కొద్ది వరకు అనిపించవచ్చు కానీ 3 గంటలకు పైగా లెంత్ ఉన్న ఈ సినిమా ఓ విజువల్ వండర్ అని చెప్పాలి. కథ అంత బలంగా ఏమి లేక పోయినా కానీ…

ఆ విజువల్స్, గ్రాండియర్ అబ్బుర పరచడం ఖాయం, స్టొరీ టేక్ ఆఫ్ కి కొంచం పట్టడం, ఇంటర్వెల్ ముందు వరకు నెమ్మదిగా సాగడం లాంటివి కొంచం అక్కడక్కడా స్లో ఫీల్ అయ్యేలా చేసినా సెకెండ్ ఆఫ్ లో సినిమా కళ్ళు చెదిరే విజువల్స్ మెస్మరైజ్ చేయడం ఖాయం, ఇక క్లైమాక్స్ కూడా ఓ రేంజ్ లో అలరిస్తుంది…. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఫస్ట్ పార్ట్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో…

ఇప్పుడు రెండో పార్ట్ కూడా అదే రేంజ్ లో మెప్పించింది… 3D వర్షన్ లో ఎఫెక్ట్స్ అయితే మరో లెవల్ లో ఆకట్టుకోవడంతో రీసెంట్ టైం లో బెస్ట్ 3D ఎక్స్ పీరియన్స్ ని కలిగించింది ఈ సినిమా… మొత్తం మీద ముందే చెప్పినట్లు కథ టేక్ ఆఫ్ కి కొంచం పట్టడంతో ఆ పార్ట్ కొంచం ఓపికతో చూస్తె సెకెండ్ ఆఫ్ ఎక్స్ లెంట్ గా మెప్పించి ఓ విజువల్ వండర్ చూసిన ఫీలింగ్ ని కలిగించడం ఖాయం… ఇలాంటి సినిమాలకు రేటింగ్స్ ఇవ్వలేం… కచ్చితంగా ఒక్క సారైనా చూసి తీరాల్సిన సినిమా ఇది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here