Home న్యూస్ బాహుబలి2 – 52 కోట్లు Vs KGF 2- 55 కోట్లు…

బాహుబలి2 – 52 కోట్లు Vs KGF 2- 55 కోట్లు…

0

బాహుబలి రాకతో మార్కెట్ ఎక్స్ పాన్షన్ భారీ గా జరడమే కాదు సినిమా ల బిజినెస్ లు కూడా సాలిడ్ గా జరగడం మొదలు అయ్యింది, ఇక స్ట్రీమింగ్ రైట్స్ కూడా సాలిడ్ డిమాండ్ రావడం మొదలు అయింది, బాహుబలి తర్వాత తెలుగు లో సాహో, సైరా మరిన్ని సినిమాలకు స్ట్రీమింగ్ రైట్స్ కిందా సాలిడ్ గా రేట్లు దక్కాయి. ఇక మన ఇండస్ట్రీ తో పోల్చుకుంటే తక్కువ మార్కెట్ ఉన్న…

కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన KGF సినిమా మొదటి పార్టీ కి స్ట్రీమింగ్ రైట్స్ అన్ని భాషల్లో కలిపి 18 కోట్లు పలికాయి. అది అప్పట్లో కన్నడ ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఏ సినిమా కి కూడా దక్కనంత రేటు. అలాంటిది ఇప్పుడు KGF రెండో పార్ట్ కి ఏకంగా…

55 కోట్ల స్ట్రీమింగ్ రైట్స్ దక్కాయి… దాంతో సీక్వెల్స్ లో చూసుకుంటే ఏకంగా బాహుబలి 2 స్ట్రీమింగ్ రైట్స్ నే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది KGF 2 సినిమా… బాహుబలి 2 కి 52 కోట్ల రేంజ్ రేటు దక్కగా ఇప్పుడు KGF చాప్టర్ 2 కి 55 కోట్ల రేంజ్ రేటు దక్కింది. ఇక తమిళ్ బిగ్గెస్ట్ మూవీ…

రోబో 2.0 సినిమా పెర్ఫెక్ట్ రేటు తెలియక పోయినా 60 కోట్ల రేంజ్ రేటు దక్కిందని టాక్. కానీ ఆ సినిమా బడ్జెట్ 540 కోట్ల రేంజ్ లో ఉంది… సో ఆ రేటు కి ఆ బిజినెస్ కూడా తక్కువే అని చెప్పాలి. ఇటు 2.0 కానీ అటు బాహుబలి 2 కానీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఇప్పుడు రూపొందుతున్న KGF చాప్టర్ 2 సినిమా…

టోటల్ బడ్జెట్ ఇప్పటి వరకు అందిన న్యూస్ ప్రకారం 90 కోట్ల నుండి 100 కోట్ల రేంజ్ లో జరుగుతుందని టాక్. ఆ లెక్కన ఈ సినిమా సాధించిన ఈ బిజినెస్ సెన్సేషనల్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్ ఎండింగ్ లో సంచలన కలెక్షన్స్ అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here