బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమా టాక్ మరీ అనుకున్న రేంజ్ లో రాక పోయినా కూడా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో లాంగ్ రన్ ని కూడా సొంతం చేసుకుని బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ షేర్ ని గ్రాస్ ను అందుకున్న సినిమాగా నిలిచింది.
టోటల్ రన్ లో ఈ సినిమా 79.82 కోట్ల షేర్ ని 135 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని దుమ్ము లేపగా సినిమా తమిళ్ లో కూడా డబ్ అయ్యి రీసెంట్ గా టెలికాస్ట్ అయింది. విజయ్ టీవీ లో సినిమా తమిళ్ డబ్ వర్షన్ ను రీసెంట్ గా టెలికాస్ట్ చేయగా అక్కడ సినిమా కి…
పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పాలి… తమిళ్ డబ్ మూవీస్ కి అనుకున్న రేంజ్ లో టి.ఆర్.పి రేటింగ్ లు సొంతం అవ్వవు.. ఉన్నంతలో వీర సింహా రెడ్డి సినిమా కి తమిళ్ లో టెలికాస్ట్ లో….
1.62 టి.ఆర్.పి రేటింగ్ సొంతం అయ్యింది. ఓవరాల్ గా ఇది డబ్బింగ్ మూవీస్ పరంగా మంచి రేటింగ్ అనే చెప్పాలి. తెలుగులో కూడా టెలివిజన్ లో మంచి రేటింగ్ లను అందుకున్న సినిమా తమిళ్ లో కూడా పర్వాలేదు అనిపించింది. ఇక బాలయ్య కొత్త సినిమా భగవంత్ కేసరితో ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.