Home గాసిప్స్ తమిళ్ సినిమా కి 200…తెలుగు సినిమా కి 90….ఇది మామూలు షాక్ కాదు!!

తమిళ్ సినిమా కి 200…తెలుగు సినిమా కి 90….ఇది మామూలు షాక్ కాదు!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ 2 సినిమాలు పోటి పడుతున్న విషయం తెలిసిందే, అందులో ఒకటి వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా కాగా మరోటి సూర్య నటిస్తున్న బందోబస్త్ సినిమా… 2 సినిమాలో ప్రజెంట్ ఏ సినిమా కి మంచి బజ్ ఉంది అంటే కచ్చితంగా వాల్మీకి కే ఎక్కువ బజ్ అండ్ క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలాంటి సినిమా కన్నా కూడా సూర్య సినిమా కి నైజాం లో థియేటర్స్ డబుల్ ఇస్తున్నారు.

కాగా ఇనీషియల్ థియేటర్స్ కౌంట్ ని నేడు అఫీషియల్ గా రిలీజ్ చేయగా సూర్య బందోబస్త్ సినిమా కి నైజాం ఏరియా లో 190 నుండి 200 థియేటర్స్ ని ఇనీషియల్ గా కన్ఫాం చేశామని పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ సినిమానే అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయితే…

వాల్మీకి కి ఎన్ని థియేటర్స్ దక్కుతాయో అని అందరు ఎదురు చూడగా ఇనీషియల్ లిస్టు లో కేవలం 90 కన్నా తక్కువ థియేటర్స్ కన్ఫాం అయ్యాయి. దాంతో తమిళ్ డబ్బింగ్ సినిమాకి అన్ని థియేటర్స్ ఏంటి తెలుగు సినిమా కి ఇంత తక్కువ థియేటర్స్ ఏంటి అంటూ సోషల్ మీడియా లో చర్చ గట్టిగానే జరుగుతుంది.

ఈ లెక్కే ఫైనల్ కాదు కానీ బందోబస్త్ ఫైనల్ నైజాం ఏరియా థియేటర్స్ కౌంట్ 220 నుండి 230 వరకు వెళ్ళే అవకాశం ఉందట. ప్రస్తుతం సూర్య ఫామ్ లో లేక పోయినా అన్ని థియేటర్స్ ని హోల్డ్ చేయడం అందరికీ షాక్ ఇస్తున్న న్యూస్ అయితే… ఫామ్ లో ఉండీ….

మంచి క్రేజ్ నడుమ రిలీజ్ అవుతున్న వాల్మీకి మాత్రం 130 నుండి 150 వరకు థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందట. దానికి కారణం ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలు పాత సినిమాల కమిట్ మెంట్ తో థియేటర్స్ అనుకున్నవి దొరకలేదని టాక్. దాంతో అవి ఓపెనింగ్స్ పై గట్టి ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here