బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. సినిమా సంక్రాంతి సీజన్ లో పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడంతో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగింది, కానీ థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన జనాలు వీకెండ్ లో తప్పితే వర్కింగ్ డేస్ లో థియేటర్స్ లోకి అడుగు పెట్టక పోవడంతో ఆ ఇంపాక్ట్ వలన సినిమా కలెక్షన్స్ స్లో అండ్ స్టడీగా కొనసాగి ఎట్టకేలకు….
సినిమా 30 రోజులకు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకోవడంతో పాటు మరో రేర్ రికార్డ్ ను కూడా ఇప్పుడు టాలీవుడ్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది అని చెప్పాలి….
అదేంటంటే టాలీవుడ్ లో సీక్వెల్ మూవీస్ హిట్ అవ్వవు అన్న విషయం అందరికీ తెలిసిందే… చాలా వరకు సినిమాలు మొదటి పార్ట్ హిట్ అయినా రెండో పార్ట్ తీసినప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోయాయి. ఒక్క బాహుబలి సిరీస్ మాత్రం మొదటి పార్ట్ కి కంటిన్యూఎషణ్ గా….
రాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ పరంగా హిట్ అయిన మొదటి సినిమాగా నిలిచింది, తర్వాత కూడా ఏ సినిమా కూడా ఈ ఫీట్ ని అందుకోలేదు. మళ్ళీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండే మొదలు అయిన బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ అదే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యి పోటి అనేది ఏమి లేకపోవడంతో…
బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు బాహుబలి సిరీస్ తర్వాత సక్సెస్ ఫుల్ సీక్వెల్ మూవీగా నిలిచి సంచలనం సృష్టించింది. ఇక అప్ కమింగ్ టైమ్స్ లో చాలా మూవీస్ కి సీక్వెల్స్ ని పార్ట్ 2 లు ప్లాన్ చేస్తున్నారు. మరి సీక్వెల్స్ హిట్ జోరు ఆ సినిమాలకు కూడా కొనసాగుతుందో లేదో చూడాలి ఇక…