కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న సోగ్గాడే చిన్ని నాయన సినిమా సీక్వెల్ అయిన బంగార్రాజు సినిమా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని UA సర్టిఫికేట్ ను సొంతం చేసుకుని 2 గంటల 40 నిమిషాల లెంత్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటూ ఉండగా మరో పక్క సినిమా కి బిజినెస్ కూడా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో సొంతం అయ్యింది, ఇక సినిమా థియేటర్స్ కౌంట్ కూడా భారీగా ఉండబోతుండగా…
సడెన్ గా సినిమా కి ఆంధ్రలో పెరుగుతున్న కేసుల కారణంగా సడెన్ గా నైట్ కర్ఫ్యూ అలాగే అన్ని థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీని అమలు చేయాలి అంటూ రీసెంట్ గా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఇది కలెక్షన్స్ పరంగా బిగ్గెస్ట్ దెబ్బ కొట్టేలా ఉందని అందరూ అనుకుంటూ ఉండగా….
సడెన్ గా ఏం జరిగిందో ఏమో మనసు మార్చుకున్న AP ప్రభుత్వం ఉన్న పళంగా కొత్త G.O ని రిలీజ్ చేసి నైట్ కర్ఫ్యూ ని ఈ నెల 18 నుండి అమలు చేస్తామని, అలాగే థియేటర్స్ లో 50% ఆక్యుపెన్సీ ని ఈ నెల 17 నుండి అమలు చేస్తూ పండగ సెలవుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఇప్పటికే పాన్ ఇండియా మూవీస్ పోస్ట్ పోన్ అయ్యి…
ఫుల్ లక్ లో పడిపోయిన బంగార్రాజు కి AP లో కొత్త ఎదురుదెబ్బ తగిలినా తిరిగి మళ్ళీ పరిస్థితులు కలిసి రావడం తో టికెట్ రేట్లు నార్మల్ గానే ఉన్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి ఉన్న పరిస్థితులలోనే మాస్ కలెక్షన్స్ జాతర ఖాయం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు ఇప్పుడు అంచనా వేస్తున్నారు.