Home న్యూస్ “బ్యాచ్”-part 1 సినిమా షార్ట్ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

“బ్యాచ్”-part 1 సినిమా షార్ట్ రివ్యూ…సినిమా ఎలా ఉందంటే!!

0

బాహుబలి, దువ్వాడ జగన్నాధం, మళ్ళీ రావా లాంటి 70 పైగా సినిమాల్లో బలనటుడు గా చేసిన సాత్విక్ వర్మ హీరో గా, ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై రమేష్ ఘనమజ్జి నిర్మించిన ఈ సినిమా కి శివగనేష్ దర్శకత్వం వహించారు… ఈ శుక్రవారం  విడుదల అయిన ఈ సినిమా పార్ట్ 1 ప్రేక్షకుల్ని ఎంతవరకు అలరించిది అనేది ఇప్పుడు చూద్దాం

కథ:
వైజాగ్ బీచ్ లో కూర్చున్న ముగ్గురు కుర్రాలతో కథ మొదలు అవుతుంది.హీరో కాలేజ్ లో జాయిన్ అవ్వడం,మొదటి చూపులో హీరోయిన్ తో హీరో ప్రేమలో పడటం అన్ని చక చక జరిగిపోతాయి, కానీ ఇక్కడే మెయిన్ కథ మొదలవుతుంది, హ్యాపీగా వున్న హీరో అండ్ అతని ఫ్రెండ్స్ లైఫ్ లోకి క్రికెట్ బెట్టింగ్ వేసి సలీం(బాహుబలి ప్రభాకర్) ఎంటర్ అవుతాడు…అసలు హీరో బెట్టింగ్ లోకి ఎందుకు వెళ్ళాడు? అ డబ్బులు కోసం సలీం పెట్టిన కండిషన్ ఏంటి?హీరో అ డబ్బులు తీర్చడానికి ఏం చేశాడు? అన్నదే మిగిలిన కథ.

యువత 18 నుండి 22 సంవత్సారాల మధ్య చేసే తప్పులు గురించి,తప్పుడు నిర్ణయాలు గురించే కొద్ది వరకు నాచురల్ గా  ప్రెసెంట్ చేసే ప్రయత్నం చేశారు ,అలానే రఘు కుంచె సాంగ్స్ సినిమా కి కొద్ది వరకు హెల్ప్ అయింది అని చెప్పొచ్చు….

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లి చూసే ఆడియన్స్ ని పర్వాలేదు అనిపించేలా అలరించే అవకాశం ఉంది, కోర్టు సీన్ కూడా ఆకట్టుకుంది… మొత్తం మీద యూత్ ని కొద్ది వరకు థియేటర్స్ కి రప్పించే సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి, మరి ఆడియన్స్ సినిమా ని ఎలా ఆదరిస్తారో చూడాలి. ఉన్నంతలో సినిమా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here