Home న్యూస్ బాహుబలి2 రికార్డ్ ని అందుకోలేక పోయిన పఠాన్!

బాహుబలి2 రికార్డ్ ని అందుకోలేక పోయిన పఠాన్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి2 పేరిట ఉన్న రికార్డులను దాదాపుగా బ్రేక్ చేస్తూ దుమ్ము దుమారం లేపిన షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్ ఇప్పుడు హిందీ లైఫ్ టైం కలెక్షన్స్ పరంగా కూడా ఆల్ మోస్ట్ బాహుబలి2 కి దగ్గరగా వచ్చింది, త్వరలో బాహుబలి2 టోటల్ హిందీ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా మరో పక్క…

బాహుబలి2 పేరిట ఉన్న ఆల్ టైం ఎపిక్ లాంగ్ రన్ రికార్డ్ ను జస్ట్ లో మిస్ చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న మూవీస్ లో పఠాన్ మూవీ అద్బుతమైన రన్ ని ఆల్ మోస్ట్ 33 రోజుల పాటు…

కొనసాగించగా 34 వ రోజు నుండి సినిమా కలెక్షన్స్ కోటి లోపే ఉండటం స్టార్ట్ అయ్యింది. దాంతో నాన్ స్టాప్ గా 33 రోజులు కోటికి తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అందుకుని హిందీ మూవీస్ లో సెకెండ్ మూవీగా రికార్డ్ సొంతం చేసుకున్నప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే మట్టుకు….

ఉరి మూవీ 41 రోజుల పాటు బాహుబలి2 మూవీ ఏకంగా 35 రోజుల పాటు ప్రతీ రోజు కోటికి తగ్గకుండా నెట్ కలెక్షన్స్ ని అందుకోగా మూడో ప్లేస్ లో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 34 రోజుల పాటు ఈ రికార్డ్ ను సాధించింది… ఇక ఇప్పుడు పఠాన్ మూవీ 33 రోజుల పాటు దండయాత్ర చేసింది… ఓవరాల్ గా బాహుబలి2 రికార్డులు అన్నీ బ్రేక్ చేసిన ఈ సినిమా ఈ రికార్డ్ ను క్రాస్ చేయలేక పోయింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here