పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ లభించాయి కానీ ఆంధ్రలో లో టికెట్ రేట్స్ అదే టైం లో ఎదురుదెబ్బ గట్టిగా కొట్టినా సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సీడెడ్ ఏరియాలో సినిమా పై…
అంచనాలు భారీగా ఉండగా ఇక్కడ ఏకంగా 16.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది సినిమా. పవన్ కళ్యాణ్ మూవీస్ కి సీడెడ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అవుతాయి కానీ ఈ సారి భీమ్లా నాయక్ 10 రోజులు పూర్తీ అయిన తర్వాత మొత్తం మీద….
10.84 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా ఇందులో వీక్ ఎండ్ అయ్యే టైం లో 50 లక్షల హైర్స్ కూడా యాడ్ అయ్యాయి… సినిమా బిజినెస్ ను అందుకోవాలి అంటే ఇంకా 5.66 కోట్లు వెనక్కి రాబట్టాల్సిన అవసరం ఉంది…. మరో నాలుగు రోజుల్లో రాధే శ్యామ్ రానున్న నేపధ్యంలో సినిమా కి ఇక్కడ భారీ ఎదురుదెబ్బ తగిలినట్లేనని చెప్పాలి. రాధే శ్యామ్ రిలీజ్ తర్వాత సినిమా ఎన్ని థియేటర్స్ ని ఇక్కడ హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుందో చూడాలి.